కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉండడమే జనసేన లక్ష్యం: కామిశెట్టి రమేష్

గురజాల, ఉత్తరప్రదేశ్ కి చెందిన వినోద్ పిడుగురాళ్ల పట్టణంలో టైల్స్ పని చేసుకుంటూ భార్య ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్లు వయసున్న పెద్ద కూతురు గుండెలో రంద్రం, పెద్దే పేగుకి రంద్రంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఏది తిన్నా వెంటనే వాంతులు కావడం. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా బాధపడుతున్న విషయం జనసేన పార్టీ పిడుగురాళ్ల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశిం సైదా దృష్టికి వచ్చింది వెంటనే వారి ఇంటికి వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. పార్టీ నాయకులతో మాట్లాడి వినోద్ కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించారు. పార్టీ నాయకులు కొంతమంది దాతల సాయంతో ఎనిమిది వేల రూపాయలు డబ్బును 10 కేజీల గోధుమ పిండిని అందజేశారు. కులం, మతం, ప్రాంతం జనసేన చూడదని, మానవత్వం ఒక్కటే జనసేన చూస్తుందని కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉండే గుణం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేర్పించారని అన్నారు. ఓట్లు కోసం, సీట్ల కోసం, నోట్లు పంచే రాజకీయం జనసేన చేయదని రమేష్, అన్నారు. వినోద్ కుటుంబ పరిస్థితి తెలుసుకొని అతనికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో సాయం చేసామని, సేవే లక్ష్యం పేరుతో పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్న వారికి కోట్లు రూపాయలు సాయం చేస్తున్నారని, అదే ఆయనకు అధికారం రాష్టాన్ని సుభిక్షం చేస్తారని జిల్లా సంయుక్త కార్యదర్శి ఖాసీం సైదా అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.