నకరికల్లులో కొనసాగుతున్న జనసేన పోరాటం!

  • 3వ రోజుకి చేరిన తాడువాయి లక్ష్మీ ఆమరణ నిరాహార దీక్ష!
  • శిబిరాన్ని సందర్శించిన సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ నాయకులు

సత్తెనపల్లి నియోజకవర్గం: మండల కేంద్రమైన నకరికల్లు గ్రామంలోని ప్రధాన రహదారు నిర్మాణం విషయమై మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తక్షణమే పనులు ప్రారంభించాలంటూ గురువారం నుండి జనసేన పార్టీ నకరికల్లు మండలాధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. శనివారం దీక్షా శిబిరాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, ఉమ్మడి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెళ్ల నాగేశ్వరరావు, దార్ల శ్రీను, నామాల పుష్ప, చిలక సత్యం, చిలకాపూర్ణ నాయకులు జనసైనికులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం నుండి జిల్లా కార్యదర్శి గుంటూరు జిల్లా ఉమ్మడి కార్యదర్శి అద్దేపల్లి ఆనందబాబు, పట్టణ అధికార ప్రతినిధి షేక్ అద్రుఫ్, పట్టణ ఉపాధ్యక్షులు చెన్నుపల్లి సాంబ, ప్రధాన కార్యదర్శి ఆర్కే యాదవ్, ప్రధాన కార్యదర్శి గుప్తా శ్రీకాంత్, నరసరావుపేట మండలం ప్రధాన కార్యదర్శి మిరియాల సుబ్బమ్మ పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం నుండి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి నిశ్శంకరావు శ్రీనివాసరావు మరియు మండల నాయుకులు జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తమ యొక్క సంఘీభావాన్ని వీడియో ద్వారా తెలిపారు.