రైల్వే గేట్ మూసివేతకు శాశ్వత పరిష్కారం చూపించాలి.. జనసేన వినతిపత్రం

పిఠాపురం: మాధవపురం రైల్వే గేటు మూసివేతపై స్పందించిన పిఠాపురం జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్ గేట్ మూసివేతతో ప్రజలు పడే ఇబ్బందులపై ఎం.పి వంగా గీత విశ్వనాధ్ కు, రైల్వే మినిస్టర్ అశ్వని వైష్ణవ్ కు వినతి పత్రాన్ని అందజేసి, పిఠాపురానికి ఆనుకుని ఉన్న మాధవపురం రైల్వేగేట్ గుండా ఇంచుమించు 20 నుంచి 30 గ్రామాలకు ముఖ్య రహదారిగా ఈ గేటు ఉపయోగపడుతుందని, ఈ రైల్వే గేటు గుండా అధిక సంఖ్యలో రైతులు తను పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్స్ ద్వారా రైస్ మిల్లులకు తీసుకెళ్ళుటకు, విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు అధిక సంఖ్యలో బస్సుల్లో ప్రయాణం చేయుటకు ఈ మాధవపురం రైల్వే గేటు ముఖ్య రహదారిగా ఉపయోగపడుతుందని, రైతులు పండించిన ధాన్యం రైస్ మిల్లర్స్ కి తీసుకెళ్ళుటకు బస్తాకు వంద రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్ అదనపు భారం అవుతుందని, తక్షణమే ఈ బ్రిడ్జ్ కి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. సమస్యకు పరిష్కారంగా ట్రాక్ ప్రక్కనే ఒక చిన్న రోడ్డు వేసి ఇలాంటి ఇబ్బందులను తొలగించాలని సూచించి, విషయాన్ని అదికారులకు అర్దమయ్యే రీతిలో రేఖాచిత్రం గీసి అందించారు.