సైదాపురం మండలంలోని ప్రజా సమస్యలు తీర్చాలంటూ స్పందనలో జనసేన వినతి

వెంకటగిరి: సైదాపురం మండల కేంద్రముతో పాటు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలంటూ సోమవారం స్పందనలో జనసేన వెంకటగిరి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకటేశ్వర్లు, మండలం అధ్యక్షులు తొండమనాటి శివ నాయకత్వం లో ఎంపిడిఓకు అలాగే గ్రామాలలో పందుల నిర్ములనకు చర్యలు తీసుకోవాలని ఎస్ఐకు వినతిపత్రంలు సమర్పించారు. ఈ సందర్భంగా మండలంకేంద్రములో పాడుబడిన బావిని పూడ్చాలని.. అలాగే వీది లైట్ ల కోసం విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలని సైదాపురం, కమ్మ వారి పల్లి, కలిచేడులో విచ్చల విడిగా తిరిగే పందులను గ్రామంలో లేకుండా పట్టించి వేయాలని, పాలూరులోని కాలనిలో నీటి కష్టాలతో అక్కడి ప్రజలు కాలువ నీటిని పట్టుకుని వాడుకునే పరిస్థితి పై ఎంపిడిఓకు వివరించారు. తరచూ మోటారు మరమ్మతులకు గురవ్వడంతో చేతి పంపులు పని చేయక ఇబ్బంది పడుతున్నారని వినతి ని అందించారు. కృష్ణారెడ్డి పల్లి మునగ పాడు వరకు రోడ్డు దుస్థితిని అలాగే తొచాంలో సిమెంట్ రోడ్డు వర్షాకాలంలో నీళ్ళు నిలిచి జారుడు రోడ్డుగా మారిందని, ఈ పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడండి బాబు అంటూ మొర పెట్టు కున్నారు. ఈ సందర్బంగా జనసేన వెంకటగిరి నియోజకవర్గ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పు కుంటున్నారని కానీ ఎక్కడా ఆ అభివృద్ధి కనపడటం లేదని ప్రశ్నిస్తున్నామన్నారు. సైదాపురం 8 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న వీధి దీపాలు, పారిశుద్ధ్యం నివారణ, త్రాగునీరు రోడ్ల సమస్యలను, గ్రామాలలో విచ్చల విడిగా ఇళ్ళ లోకి పంట భూముల్లోకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్న విషయాలను అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. అధికారులు పాజిటివ్ గా స్పందించారన్నారు. ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలు తీర్చి మన్ననలు పొందాలన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు రెవిన్యూ లో గత కొన్నేళ్ళుగా భూసమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. 2500 ఎకరాలలోని 1100 ఎకరాలకు రైతుల అనుభవంలో ఉన్న భూములకు 2010 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రీసర్వే చేసి యున్నదన్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకుల వల్ల రైతులకు పట్టాలు రాకుండా ఆగి పోయిందన్నారు. ఈ భూముల సమస్య పై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ ల దృష్టికి జనసేన పార్టీ తరపున ఫైల్ అందజేశామన్నారు. ఈ డిశంబర్ నెల 1వ తేదీ ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55 గ్రామాల ఇనాం భూములకు పట్టాలు యిచ్చే లా రూపకల్పన చేయడం పేపర్ లో రావడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాలో ఒక్క సైదాపురం మండలం కలిచేడు మాత్రమే ఇనాం అబాలిష్ గా ఉందన్నారు. గత సర్వే రికార్డు ప్రకారం పట్టాలు యిచ్చే పనులు చేపట్టి ఈ ప్రభుత్వం మంచి పేరు తెచ్చు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలం అధ్యక్షులు తొండమనాటి శివ, ఉపాధ్యక్షులు మగ్గం నవీన్, కాపు సంక్షేమ సేన వెంకటగిరి అధ్యక్షులు బిసా బత్తిన లక్ష్మి కాంత్ జనసైనికులు సుబ్బారావు, బాల మునేంద్ర, షరీఫ్, విజయ్, రాజ రాయల్ తదితరులు పాల్గొన్నారు.