గ్రామ పంచాయితీ కార్మికుల నిరవధిక సమ్మెకు జనసేన సంఘీభావం

జగిత్యాల నియోజక వర్గం: జగిత్యాల జిల్లా, సారంగా పూర్ ఎం.పి.టి.ఓ కార్యాలయం ఎదుట పంచాయితీ కార్మికుల నిరవధిక సమ్మెలో పాల్గొని జనసేన పార్టీ జగిత్యాల నియోజక వర్గం ఇంచార్జి బెక్కం జనార్దన్ జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలపటం జరిగింది. ఈ సందర్భంగా బెక్కం జనార్ధన్ మాట్లాడుతూ.. కార్మికుల న్యాయ పరమైన డిమాండ్లను పట్టించు కోకుండా వారు 30 రోజులుగా సమ్మె చేస్తున్న వారిని అనాధలుగా రోడ్ల మీదికి తెచ్చారని అన్నారు. మల్టి పర్పస్ విధానాన్ని రద్దు చేసి పి.ఆర్.సిలో నిర్ణయించిన మినిమం బేసిక్ ను 19000 వేలు కనీస వేతనంగా ఇవ్వాలన్నారు. పి ఎఫ్ ఈ యస్ ఐ ప్రకారం బీమా గ్రాట్యుటీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. మరణించిన కార్మికుని దహన సంస్కారాలు 30 వేలు ఆర్థిక సాయం, వయసు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే వారి కుటుంబంలొనే ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. కార్మికుల సహజ మరణానికి 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, పంచాయితీ కార్మికుల డిమాండ్లని తక్షణమే ప్రభుత్వం నెరవేర్చి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు. ఈ పంచాయితీ కార్మికుల నిరవధిక సమ్మెలో జనసేన పార్టీ తరుపున వారికి మద్దతుగా జగిత్యాల నియోజక వర్గ ఇంచార్జి బెక్కం జనార్దన్ గారితో పాటు జనసేన పార్టీ జగిత్యాల మండల అధ్యక్షులు బొల్లి రాము ఉపాధ్యక్షులు బొల్లి లక్ష్మణ్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు రమేష్ మహ్మద్ ఆజీ తదిరతులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.