జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ కి జనసేన మద్దతు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ బిజెపి పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ పైస మోజెస్ మరియు ఉమ్మడి జిల్లా నాయకుడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పడాల ప్రసాద్ గౌడ్ మానకొండూర్ నియోజకవర్గ జనసేన పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు కలిసి భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ కి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పైస మోజెస్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గంలో ఆరేపల్లి మోహన్ గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ బిజెపితో కలిసి ముందుకెళ్తుందని తెలియజేశారు. పడాల ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆరెపల్లి మోహన్ వెంట ఉండి గెలిపిస్తామని జనసేన బిజెపి సత్తా చూపించి మోహన్ అన్నను ఎన్నికల్లో గెలిపిస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు మండల అధ్యక్షులు దయ్యాల నాగరాజు, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు ల్యాగల మధు, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పడాల సాయికుమార్, శంకరపట్నం మండల అధ్యక్షులు సొల్లు రాకేష్, మానకొండూరు మండల ఉపాధ్యక్షులు బండ పెళ్లి మారుతి గౌడ్, చాణిక్య రమేష్, గట్టేశం, కుమారస్వామి, వివేక్, శ్రీకాంత్, శివ, వేణు, రాకేష్, సందీప్, శ్రీను, భూమిరెడ్డి, వినయ్, పవన్, శ్రీను, జెనసైనికులు తదితరులు పాల్గొన్నారు.