నిరాధార కుటుంబానికి అండగా జనసేన చేయూత

పాయకరావుపేట: యస్ రాయవరం మండలం, పెదగుమ్ములూరు గ్రామంలో కుటుంబాన్ని పొషించే యజమాని లేవలేని స్థితిలో వున్న నిరాధార కుటుంబానికి జనసైనికులు మేమున్నామన్టూ అండగా జనసేన పార్టీ అండగా నిలిచింది. యస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు శానాపతి బాబూరావు (మాష్టారు) నేతృత్వంలో జనసైనికులు పెదగుమ్ములూరు గ్రామానికి చెందిన పోలవరపు లోవరాజు కుటుంబానికి అండగా నిలిచారు. లోవరాజు గీతకార్మికుడు కాగా, గడచిన కొన్నిరోజులుగా కాళ్ళు చచ్చిబడిపోయాయి. దీంతో కుటుంబాన్ని పోషించే దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసైనికులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచేదిశగా తమ వంతు 10,000 రూపాయల నగదు, శ్రీవిద్య శ్రీనివాస్ తమ వంతు మూడు నెలలకు సరిపడా కిరాణాను అందించారు తమ కుటుంబానికి అండగా నిలిచిన జనసైనికులకు కుటుంబసభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసైనికులు బాబూరావు మాష్టారుతో పాటుపార్టీ ప్రెసిడెంట్ ప్రసాదుల గణేష్, మత్తి కార్తీక్, పులి సత్తిబాబు, కోలపాటి బాబ్జి, బలంకి రాజు, లింగంపల్లి నానాజీ, వంగలపూడి నానాజీ, దమ్ము రాజు, ఏ.వి.ఎస్, పెరుమాళ్ళ వెంకటేష్, కొత్వలా శ్రీను, నక్కా శ్రీను పాల్గొన్నారు.