నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పలు కీలక సమస్యలను జనసేన నేతలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
బోధనా సిబ్బంది లేక డిప్లమా చేసిన విద్యార్థులు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా సర్టిఫికెట్ లేక ఆ అవకాశాలను వదులుకుంటున్నారని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కనిగిరికి చెందిన పేదలకు పంపిణీ చేసిన డి-ఫారం పట్టాలను కొందరు అధికారుల అనుసంధానంతో అన్యాక్రాంతం చేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని, బాధితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ విజ్ఞప్తులపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, గుర్రం కిషోర్, సుల్తాన్ భాయ్, రాజేష్, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment