నెల్లిమర్ల మండలంలో మన ఊరిలో జనవాణి

నెల్లిమర్ల నియోజకవర్గం: నెల్లిమర్ల మండలం, మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గం, గుశిని పంచాయతీలో చల్లమల్లపేట గ్రామాన్ని నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి సందర్శించారు. గ్రామంలో ప్రజలకు తమని తాము పరిచయం చేసుకుంటూ ప్రజాసమస్యలను వింటూ రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో వారు గెలిచిన వెంటనే మరెన్నో బహుళజాతి సంస్థలను నెల్లిమర్ల నియోజకవర్గానికి తీసుకువచ్చి ప్రతీ ఒక్క నిరుద్యోగులకు వారి విద్యార్హతలను బట్టి వారికి తగిన జీవనోపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. త్రాగునీటి సమస్యలు మరియు డ్రైనేజీ సమస్యలు గురించి ప్రజలు ప్రస్తావిస్తూ ఉండగా ప్రతీ వాడలో ఇదే సమస్య వింటూ ఉన్నాను. అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తుంది అని మండి పడ్డారు. మరియు మన జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ త్రాగునీటి సమస్య మరియు డ్రైనేజీ సమస్య లేకుండా పూర్తిస్థాయిలో ప్రజలందరికీ మరింత మెరుగుగా సేవలు అందించేందుకు జనసేన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీనియర్ సిటీజన్ల నుండి ప్రభుత్వ తీరు మరింత మెరుగుపడేలా సలహాలను తీసుకున్నారు మరియు వారు మరింత ఉత్సాహంగా పని చేసి పుట్టిన జన్మభూమి రుణం తీర్చుకుంటానని సెలవిచ్చారు. ఈ కార్యక్రమంలో కరుమజ్జి గోవింద్, సురేష్, వాసు, శేఖర్, నాగరాజు, రామచంద్ర, శివాజీ, యశ్వంత్, నాయుడు, బద్రి, కోటేశ్వరరావు, రేవల్ల రమణ పాల్గొన్నారు.