*ఇచ్చాపురం నేత దాసరి రాజు
ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన “జనవాణి – జనసేన భరోసా” కార్యక్రమం క్రమంగా ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. తక్షణమే పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల బాధల పరిష్కారానికి జనసేన నిలిచిందని, ఇటువంటి మహత్కార్యంలో తనలాంటి నియోజకవర్గ నేతలకు భాగస్వామ్యం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్ పాకనాటి రమాదేవి, లీగల్ సెల్ కార్యదర్శి చెక్కపల్లి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment