నేడు అమెజాన్ ప్రైమ్‌లో ‘జాతిరత్నాలు’

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు’. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. నవీన్‌కు జోడిగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‏గా నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ కూడా కనిపించి అలరించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకోగా.. భారీ వసూళ్లను సైతం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్‌ల వర్షం కురిపించింది. ఇదిలావుంటే, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. నేటి నుంచి (ఏప్రిల్‌ 11 ) స్ట్రీమింగ్ చేయనుంది.