రియల్ ఎస్టేట్ దందాలపై ఫిర్యాదు చేసిన జవాజీ రేఖగౌడ్

ఎమ్మిగనూరు, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారులకు కర్నూల్ నగరం నందు ఎటువంటి నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ దందాలపై ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్, రాయలసీమ సంయుక్త కమిటీ మెంబర్ రేఖగౌడ్. మాట్లాడుతూ… కర్నూలు నగరంలో అధికారుల కళ్లు కప్పి ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతివాటంపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని… కర్నూలు నగరంలోని అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ దందా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారులను కోరుతున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో హంద్రీ నది ఒడ్డున ప్రభుత్వ నింబందనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతూ బఫర్ జోన్ లో ఇళ్ళ నిర్మాణం చేపడుతున్న అగ్రసేని బిల్డర్స్ ఓనర్ బికే సింగ్ అక్రమాలపై చర్యలు తీసుకొని, భాదితులు కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేయటం జరిగింది. అలాగే కర్నూలు నగర శివారులో రింగ్ రోడ్డు పక్కన కొండను తవ్వి, ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్ వేసిన స్కంద హిల్స్ యాజమాన్యం అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. రాగమయూరి బిల్డర్స్ తమ వెంచర్స్ లో ప్రభుత్వ భూములను, అసైడ్ భూములను కబ్జా చేసి వెంచర్ వేయడం జరిందని, వారి అక్రమాలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను డిమాండ్ చేయటం జరిగింది.