జనసేన పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుర్గా రావు
పిఠాపురం వేదికగా నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ “జయకేతనం” కార్యక్రమానికి పలాస నియోజకవర్గం నుంచి విచ్చేసిన జనసైనికులు, వీర మహిళలు, మరియు అధినేత పవన్ కళ్యాణ్‌ను గుండెల్లో పెట్టుకున్న పలాస నియోజకవర్గ ప్రజలందరికీ జనసేనపార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుర్గారావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పలాస నియోజకవర్గం జనసైనికులు, వీర మహిళల కోసం డాక్టర్ దుర్గా రావు రెండు బస్సులు మరియు కొన్ని కార్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 150 మంది హాజరయ్యారు. బస్సుల ద్వారా ప్రయాణించిన వారికోసం శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త కోరికాన రవికుమార్ మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలతో పాటు నీటి సౌకర్యం అందించారు. బస్సులలో ప్రయాణిస్తున్న జనసైనికులను బాధ్యతగా తీసుకెళ్లడంలో వాలంటీర్లుగా పనిచేసిన పందిరి నీలయ్య, తెలుకల సందీప్, జుత్తు భూపతి, పోతనపల్లి చిరంజీవి, దేవరబద్ర రోహిత్, బెండి దిలీప్, దాసరి శ్రీనివాస్, జనపాన గణేష్ రెడ్డి తదితరులను ప్రత్యేకంగా అభినందించారు. సభలో ప్రత్యేక గ్యాలరీలలో ప్రవేశం కోసం జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు సీనియర్ నాయకులకు ఎంట్రీ పాసులు అందజేశారు. సభ విజయవంతంగా
పూర్తయిన తర్వాత జనసైనికులు, వీర మహిళలు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరి తమ ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన మొదటి సభగా, అలాగే గెలుపు అనంతరం పిఠాపురంలో నిర్వహించిన తొలి విజయోత్సవ సభగా “జయకేతనం” ప్రత్యేకతను సాధించింది. పవన్ కళ్యాణ్ రాకతో కార్యకర్తలు, అభిమానులు కరతాళ ధ్వనులతో సభను మరింత జోష్‌గా మార్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభకు జనసైనికులు ఉదయం నుంచే భారీగా తరలి రావడంతో గ్యాలరీలు నిండిపోయాయి. ప్రసంగాలను చూడటానికి ఎల్‌ఈడీ స్క్రీన్ల ఎదుట కూడా వేలాది మంది నిలబడి వీక్షించారు. 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో “జయ.. జయ.. కేతనం” అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సభ విజయవంతంగా పూర్తవడం ద్వారా ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని మరింతగా చాటుకున్నామని, అదే ఊరిలో ఒక రాష్ట్రం నిండడం వంటి అనుభూతిని పొందారని అన్నారు.

Share this content:
Post Comment