దెందులూరు జనసేన-టిడిపి-బిజెపి ఆధ్వర్యంలో జయహో బీసీ

దెందులూరు నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం మంగళవారం పెదపాడు మండలం, అప్పనవీడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దెందులూరు నియోజవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మేల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి, గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు మేడిచర్ల కృష్ణ, దెందులూరు నియోజవర్గ అధికార ప్రతినిధి తాతపూడి చందు, దెందులూరు నియోజకవర్గ పెదపాడు మండల జనసేన పార్టీ నాయకులు కోటప్రోలు సురేష్, గరికిపాటి చంటి, వడ్డి భార్గవ్, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కో-ఆర్డినేటర్, కోటప్రోలు ఫణి, వీర మహిళలు బలే నాగలక్ష్మి, యర్రంశెట్టి దేవిక, అప్పనవీడు గ్రామ జనసేన నాయకులు జనసైనికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.