చిలకలూరిపేట, జనసేన పార్టీ ఆవిర్బావ సభతో దేశం అంతా జనసేన వైపు చూస్తుందని, పిఠాపురంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎగురవేసిన ‘జయకేతనం’ భావి భారతావనికి దిక్చూచిగా మారనుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అభివర్ణించారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోదీనే ఓ రాజకీయ కార్యక్రమంలో పవన్‌ను ‘ పవన్ కాదు.. తుఫాన్’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారని గుర్తు చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌ను నివారించటానికి, రాజకీయాల్లో ఎదగకుండా చేయటానికి చేయని కుట్ర లేదు.. వేయని కుతంత్రం లేదని.. అటువంటి కుట్రలను చేధించుకొని, ఏకంగా 12 సంవత్సరాలు యుద్ధం చేశారని. ఆ యుద్ధంలో తిరుగులేని గెలుపును సొంతం చేసుకున్నారని వెల్లడించారు. జనసేన ఆవిర్బావ సభ చరిత్రలో నిలిచిపోనున్నదని చెప్పారు.
- జనప్రవాహంతో జనసేన జయకేతనం
జనప్రవాహంతో జనసేన సభ పోటెత్తిందని, పిఠాపురంలో ‘జయకేతనం’ ఎగురవేసిందని బాలాజి వెల్లడించారు. ఎక్కడ తగ్గాలో తెలిసిన మనిషికి సినిమాలు.. రాజకీయాలు వేరు కాదని.. దేన్నైనా పట్టి మెడలు వంచి దారికి తెచ్చుకోవటమే పవన్ కళ్యాణ్‌కు తెలుసన్న విషయాన్ని సుస్పష్టం చేశారని వెల్లడించారు. స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా..పవన్ కళ్యాణ్ క్రేజే వేరని వెల్లడించారు. జయకేతనం సభకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా అభిమానులు పాల్గొనడాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఒక్క ఏపీకి చెందిన వ్యక్తి కాదని స్పష్టమైందని, రానున్న రోజుల్లో దేశవ్యాప్త రాజకీయాల్లో జనసేన పార్టీ కీలకంగా మారుబోతుందని పేర్కొన్నారు. డొంక తిరుగుడు లేకుండా జనసేన పార్టీ సిద్దాంతాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని, రేపటి చరిత్రలో జనసేన విజయానికి పవన్ కళ్యాణ్ ఇప్పేడే ప్రణాళికలు రచించారని వివరించారు. దేశ రాజకీయాలు మొదలైన నాటి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి అంటే నామ మాత్రమే అని. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవికి అలంకారం వచ్చిందన్నారు. జనసేన ఆవిర్బావ సభ విజయవంతం చేసినందుకు జనసైనికులకు, వీర మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు బాలాజి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment