కైకలూరు, జయమంగళ వెంకట రమణ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. యువతకు మార్గదర్శకంగా నిలిచిన నేతకు బెలపుకొండ వెంకన్న బాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జనసేన పార్టీ నాయకుడు జయమంగళ వెంకట రమణకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అని మైగాపుల రామాంజినేయులు తెలియచేసారు. “జనసేన తేజస్సుగా నిలిచిన వెంకట రమణ ఓ ఆదర్శ నాయకుడు. ప్రజల నడకలో నడిచే నాయకుడిగా, గ్రామీణాల నుంచి గలగల కదిలే ఆశయాలను ప్రతినిధ్యం వహించిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు నేడు ఓ స్ఫూర్తిదాయకమైన రోజు. జనసైనికులందరం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి.” అని చెనంశెట్టి నందకిషోర్ మరియు ఎరంశెట్టి శ్రీను స్ఫూర్తి కూడిన సందేశం ఇచ్చారు. “ఇవాళ్టి యువత దేశ భవిష్యత్తు. మీరు చదువులో, శ్రద్ధలో, సామాజిక బాధ్యతలో ముందుండాలి. జయమంగళ వెంకట రమణ చూపిన దారిలో నడవాలి. నిజాయితీ, సమర్పణ, దేశభక్తి ఇవే మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దుతాయి. కేవలం కెరీర్ కోసం కాకుండా, సమాజం కోసం కూడా మీరు జాగ్రతగా ఉండండి.” అని నియోజకవర్గం జనసేన నాయకులు తణుకుల రవితేజ తెలియచేసారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర ప్రాంతాలలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన పట్ల తమ గౌరవాన్ని తెలియజేశారు.
Share this content:
Post Comment