ఆరని విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు: మత్స పుండరీకం

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo,వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు.

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్, జనసైనికుడు మత్స పుండరీకం ముందుగా దీపజ్యోతిని వెలిగించి.. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆరని విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు అని, బ్రిటీష్ వారికి వణుకు పుట్టించిన వీరుడు, అతడే ఒక సైన్యంగా మన్యం ప్రాంతం ఓ కార్య క్షేమంగా మలచుకొని ఎందరికో ధైర్యం నింపాడు, విల్లoబు చేతపూని స్వతంత్ర పోరాటంలో విప్లవాగ్ని రగిల్చిన గొప్ప స్వాతంత్ర్య ఉద్యమ కారుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. జనసైనికులు అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీ సిద్ధoతల్లో కులాల ప్రస్తావన లేకుండా.. పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాన్ని (మన్యం ప్రాంతాలను) రక్షిoచి భావితరాలకు ఆదర్శంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు తదితర స్వతంత్ర ఉద్యమ కారులను ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో, దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాడానికి చిహ్నమే జనసేన పార్టీ జండాలో ఎరుపురంగు అని, స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన అందించడమే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అని మత్స పుండరీకం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు చింత గోవర్ధన్, తాడి అంజి బాబు, వావిలిపల్లి విశ్వేశ్వర రావు, వాన కైలాష్, బి.పి.నాయుడు, కంటు మురళి, వావిలిపల్లి నాగభూషన్, దండేల సతీష్, అన్ను రామకృష్ణ, కంటు గణేష్, మంతిని బాను తదితరులు పాల్గొన్నారు.