ప్రత్తిపాడు జనసేన ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

ప్రత్తిపాడు: ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్బంగా శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గం 47వ డివిజన్లో కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతీ ఆధ్వర్యంలో గోరంట్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తి అందరికి ఆదర్శం అని, ఆవిడ పోరాట పటిమని మహిళలు అందరూ పునికి పుచ్చుకోవాలి అన్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మి భాయ్ గారి స్పూర్తితో వీరామహిళా విభాగం ఏర్పాటు చేసారు అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడంలో తమ వంతుగా కృషి చేస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి దుర్గ, ఆలపాటి సాంబ మరియు వీరమహిళలు పాల్గొన్నారు.