పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

  • ఝాన్సీరాణి స్పూర్తితో పోరాడదాం
  • స్త్రీ శక్తికి ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి
  • ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి రోజున పలువురు ఇతర పార్టీల నుంచి జనసేనలోకి చేరిక…

అనంతపురం: అసమాన ధీశాలి, అపూర్వ యుద్ద నిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు స్వాతంత్ర సేనాని ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీలత ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ ప్రజలపై తెల్లదొరల దమనకాండకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం సాగించి ఆత్మార్పణం చేసిన దిశాలి ఝాన్సీ రాణి అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ మహిళా సాధికారతకు, రాజకీయాలలో మహిళల ప్రాధాన్యతకు కృషి చేస్తున్నారని తెలియ జేశారు.. అనంతరం వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీలోకి పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి నగర ప్రధాన కార్యదర్శి రోళ్ళ భాస్కర్ వీర మహిళలు శైలజా, యమునా, కుళ్లయమ్మ, అనసూయ, వరలక్ష్మి, మంజుల నాయకులు పూజారి పవన్, ఉత్తేజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-11-19-at-4.37.26-PM-1.jpeg