జాబ్ మేళా సంతృప్తినిచ్చింది: బొలిశెట్టి రాజేష్

తాడేపల్లిగూడెంలోని లోటస్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా సంతృప్తినిచ్చిందని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో సుమారు 6000 నిరుద్యోగ యువతీ యువకులు రిజిస్టర్ చేయించుకోగా వారిలో 1150 మందికి తొలి విడత జాబ్ నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి కూడా సెకండ్ కాల్ లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. నిన్నటి జాబ్ మేళాలో వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనంతో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పించి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడడంలో లోటస్ యాజమాన్యం సహకరించిందన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారిలో గరిష్టంగా 45 వేల నుంచి 13000 కనిష్ట జీతాలు ఇస్తున్నారన్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ జాబ్ మేళాకు జిల్లా నలుమూల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా యువత భారీగా తరలివచ్చారన్నారు. జాబ్ మేళాలో ఒకటి బై మూడు వంతు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతృప్తినిచ్చిన అంతమంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం వేచి ఉండడం ఎంతో బాధ కలిగించిందన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యం అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు ఇటు జనసేన నాయకులతో పాటు, జనసేన ఐటీ వింగ్ నిర్వాహకులు, పోలీసులు రెవెన్యూ సిబ్బంది , విద్యార్థి విభాగం నాయకులు సహకరించాలని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరము ఆఖరులోగా ఐటి సంస్థలతో మరో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. తమపై నమ్మకం ఉంచి భారీగా వచ్చిన యువతీ యువకులకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, అడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్రప్రసాద్, నీలపాల దినేష్, అడబాల రామారావు, రవ్వాడ దుర్గారావు, బయనపాలేపు ముఖేష్, యాంట్రాపాటి రాజు, చాపల రమేష్, అడ్డగర్ల సూరి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment