జోగయ్యపుత్ర ఎంత ప్యాకేజీ తో వైసీపీలోకి వెళ్ళావ్

  • లేఖలతో హరి రామ జోగయ్య పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారు
  • వైసిపి అంతం – జనసేన పంతం
  • పవన్ ను విమర్శించే కాపు నేతల్ని ప్రశ్నించిన కిరణ్ రాయల్

తిరుపతి: మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన ఆనాటి కాపులు వేరని.. నేటి కాపులు రాజకీయంగా బాగా ఎదిగారని, గత చరిత్రలో కాపు నేతగా సీఎం స్థాయిని పొందగలిగే ప్రజాభిమానంతో పాటు తన సొంత కష్టార్జితాన్ని ఖర్చు పెడుతూ.. ప్రజాసేవ చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ లోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటూ అవినీతి, దుర్మార్గం, దోపిడి, దుష్ట రాజకీయాలను ప్రశ్నిస్తూ, అడ్డుకుంటూ.. తెలుగు ప్రజలను కాపాడుకునే దిశగా, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీని గద్దె దింపే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని, రాజకీయాన్ని రాజకీయంతోనే మట్టు పెట్టాలనే దిశగా పయనిస్తున్న మా అధినేత పవన్ కళ్యాణ్ ను అర్థం చేసుకోకుండా, ఆయనను కించపరిచే విధంగా, అడ్డుకునే కాపు నేతల కుట్రలకు బలైపోకుండా, వైసిపి అంతం జనసేన పంతం అనే నినాదంతో పయనిస్తున్న పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే చూస్తూ ఊరుకోబోమని, కాపునేతల లేఖలన్ని మడిచి వాళ్లే పెట్టుకోవాలని విమర్శిస్తూ.. జనసేనపార్టీ నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు కొండా రాజమోహన్, హిమవంత్, గుట్టా నాగరాజు, హేమంత్, వంశీ, ఆది పురుషోత్తం లతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం తో పాటు లేఖల వీరుడిగా కాపుల బాగు కోరే ముసుగులో వైసీపీకి పనిచేసే హరి రామ జోగయ్య మాటల్ని అలాగే వైసీపీలో చేరిన జోగయ్య కుమారుడు వైఖరిని ఖండిస్తూ కిరణ్ నిప్పులు చెరిగారు. వైసీపీలో చేరిన కన్న కొడుకును అదుపులో పెట్టుకోలేని జోగయ్యకు తమ జనసేననానికి లేఖల ద్వారా సలహాలు ఇచ్చే అర్హత కోల్పోయారని దుయ్యబట్టారు. మహాయుద్ధంలో వైకాపాపై గెలుపే ధ్యేయంగా దూసుకెళుతున్న తమ పవన్ వెనుక నడిచే కాపులే అసలైన, నిజమైన కాపులంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన జిల్లా నాయకులు, జనశ్రేణులు పాల్గొన్నారు.