జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు: చిట్వేలి జనసేన

రైల్వే కోడూరు: వెంకటయి పాలెంలో జరిగిన ఒక నిండుసభలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలను రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలి మండల జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం చిట్వేలి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మాదాసు నరసింహ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జోగి రమేష్ ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కావటం లేదు!. రాష్ట్ర మంత్రిగా ఎదో ఉద్దరిస్తావ్ అని నిన్ను ప్రజలు ఎన్నుకుంటే చేసింది నయా పైసా పని మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు, పెడన నియోజవర్గం మొత్తం ఇసుక మాఫియా తో నింపేశావ్. కనీసం నీకు ఇచ్చిన శాఖ మీద 10 శాతం కూడా అవగాహన లేని నీవు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. నీ అవినీతి చిట్టా మొత్తం మా అధ్యక్షుల దగ్గర ఉంది. ఆయన వచ్చి నీ అవినీతి చిట్టా బయట పెడతారు. ఆ రోజు కోసం వేచి చూస్తున్నాం. కంచర్ల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఏ పదవిలో లేక పోయినా కౌలు రైతుల కోసం కోట్ల రూపాయలు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఏరోజైనా నీ సొంత డబ్బు లక్ష రూపాయలు సహాయం చేయలేని నువ్వు పవన్ కళ్యాణ్ పేరు ఉసెత్తే అర్హత నీకు లేదు. నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నారు. ఆనందల తేజ మాట్లాడుతూ.. నీ కొడుకుకు ఎమ్మెల్యే సీటు కావాలంటే ముఖ్యమంత్రి బజన చేసుకో.. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితం గురించి అవాకులు, చెవాకులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సైగ చేస్తే కనిపించకుండా పోతావు అన్నారు. పగడాల శివ మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.. ఈ 6 నెలలు అయినా ఏదైనా చేసి చూపించు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ, షేక్ రియాజ్, మాదాసు శివ, కంచర్ల సుధీర్ రెడ్డి, ఆనందుల తేజ, పగడాల శివ, పొన్నారెడ్డి, కడుమూరు సుబ్రహ్మణ్యం, అద్దంకి సురేష్, నీలి కృష్ణ, సతీష్ రెడ్డి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.