ఊరు ఊరంతా జనసేన పార్టీలో చేరిక

  • జనసేన పార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య

గిరిజన గ్రామాలకు మౌళికసధుపాయల కల్పనలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం. గిరిజన ద్రోహపు చర్యలలో వైసీపీ ప్రభుత్వం కంటే గిరిజన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, తదితర నాయకులు చేసిన ద్రోహమే ఎక్కువగా బాధించింది. గిరిజన అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు కూడా పక్కదారి మళ్లించడం గిరిజనులను దారుణంగా మోసం చెయ్యడం. ఇన్ని దారుణాలు చేసి ఇంకోసారి గిరిజనులకు మోసం చెయ్యడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ గిరిజన ప్రజాప్రతినిధులు తీరు చూస్తే తన పిల్లల్ని తానే తినే తోడేళ్ళు జ్ఞప్తికి తెస్తోంది. ఇంకోసారి మోసపోవడనికి సిద్ధంగా లేము అందుకే జనసేనపార్టీ లో చేరుతున్నాం కచ్చితంగా వైసీపీకి బుద్ది చెబుతాం. వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీని గెలిపిస్తాం డల్లాపల్లి గ్రామస్తులు. పాడేరు మండలం డల్లాపల్లి గ్రామంలో సమావేశమైన జనసేనపార్టీ నాయకులు పాడేరు ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు మండల నాయకులు ఈ సందర్బంగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. డా. గంగులయ్య మాట్లాడుతూ గతంలో మీరంతా వైసీపీ పార్టీకి నమ్మి ఓటేశారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మీరు మాకే ఓటేశారని గ్యారెంటీ ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో నాయకత్వ సమర్థత లోపం జరిగితే అటువంటి నాయకులను ఎన్నుకుంటే ఇటువంటి అసంబద్ధ వాక్యాలు నాయకులు చేస్తారు. ఇది ఎంత మాత్రం గిరిజనజాతి సంరక్షణ చేపట్టే నాయకత్వ లక్షణం కాదు ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు పణంగా పెడితే ప్రభుత్వాలు గిరిజన ప్రజల జీవన స్థితిగతులు పరిశీలించి రాజ్యాంగ బద్దంగా అనేక సంస్కరణలు చేపట్టింది ఫలితంగా మూడు దశాబ్దాలకు పైగా గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనకు జీవో నెం3 ద్వారా స్వర్ణయుగం ప్రాప్తించిందని చెప్పుకోవచ్చు మరీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటీ? గిరిజన గ్రామసీమల దుస్థితిలో ఏమైనా చెప్పుకోదగ్గ వచ్చిన మార్పులేమిటో వైసీపీ ప్రభుత్వ గిరిజన ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలన్నారు. గిరిజన ప్రజలకు వారి ప్రాంతాలకు రక్షణ కల్పించే అనేక అంశాలను, వ్యవస్థలను రోజు రోజుకి బలహీన పరిచి నిర్వీర్యం చేస్తూ పోయి ఏదో ఒకరోజుకి ఈ ప్రాంతాన్నీ మల్టీ నేషనల్ కార్పోరేట్ కంపెనీలకు కేవలం కాసులకి కక్కుర్తి పడీ అమ్మేస్తారు అంతా అయిపోయాక గగ్గోలు పెడితే లాభం లేదు ప్రజాస్వామ్యంలో మన ఓటే మన ఆయుధం మనం ఎన్నుకునే నాయకులను నిర్ణయిస్తుంది రాజకీయ చైతన్యంతో గిరిజన రక్షణపై ఆలోచనతో మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాలి. అసెంబ్లీ వేదికలో మన గిరిజన జాతికోసం అద్భుతాలు జరిగేలా సంస్కరణలు తీసుకు రాకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు నిర్ణయాలు, చీకటి తీర్మానాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు బలంగా తిప్పికొట్టాలి, అడ్డుకోవాలి కనీసం రక్షణాత్మకమైన ఆలోచన విధానాన్నైనా అనుచరించాలి. కానీ ప్రస్తుతం మన ప్రజాప్రతినిధులు నెల వారిగా జీతాల గురించి వారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటున్నారు తప్పితే మన ప్రజల జీవితాలు ఏమవుతుందో ఆలోచన చేయట్లేదు మేము దీనిని గిరిజన జాతికి పట్టిన రాజకీయ వికృత రుగ్మతగా ఒక జబ్బుగా పరిగణిస్తున్నాం. జనసేన పార్టీ ద్వారా నియోజకవర్గంలో అనేక గ్రామాలను సందర్శించి యువతకు, గిరిజన పెద్దలకు, మేధోవర్గానికి ప్రస్తుత గిరిజన రాజకీయ పరిస్థితులపై వివరిస్తూ మన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మొదటి నుంచి గిరిజన ప్రజలంటే జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏదైన మంచిచేయాలనే ఒక దృక్పధం ఉంది. మా వైపు ఎంతో మంది చదువుకున్న యువత పట్టణాలలో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ వాటిని వదిలేసి జనసేన పార్టీ ద్వారా గిరిజన సంరక్షణ చేపట్టడమే ప్రస్తుతం మనముందున్న లక్ష్యంగా భావించి ఇవాళ నియోజకవర్గమంతాట గ్రామపర్యటనలు చేస్తున్నారు. నిజానికి వైసీపీ ప్రభుత్వానికి గాని, ప్రజాప్రతినిధులకు గాని గిరిజన ప్రజలకు ఇంకోసారి ఓట్లు అడిగే నైతిక హక్కులు లేదు కానీ వికృత రాజకీయ వ్యభిచారంలో వైసీపీ నేతలు ఆరితేరిపోయారు. కనుక వచ్చే ఎన్నికలకు ఓట్లకి నోట్లు అంటూ మీ గ్రామాలకు వస్తారు మీరిచ్చే సమాధానం ఏమిటో మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి అలాగే మీకు ఒక వాస్తవం చెప్పాలనుకుంటున్నాం గిరిజన వైసీపీ నేతలు గిరిజన జాతిని, జాతి ఆస్తిత్వంపై ఎటువంటి అత్యాచారమైన చేసుకోవచ్చని ముందుగా మాకు చిల్లర కొడితే చాలని ఇటువంటి చీకటి ఒప్పందాలు కుదిరింది. వైసీపీ ప్రభుత్వానికి, కార్పోరేట్ శక్తులకు, మన నాయకులకు మధ్య చీకటి ఒప్పందాలు జరిగిపోయింది. ఈ విషయం రాజకీయ చైతన్యమున్న ప్రతి గిరిజన యువతి యువకులకు అందరికి తెలిసిందేనన్నారు. అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, గిరిజన సంరక్షణ విధానాలు నచ్చి గ్రామస్తులంతామంది మూకుమ్మడిగా జనసేన పార్టీలో చేరారు. వారికి డా. గంగులయ్య కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇకపై కలిసిపోరాడుదామన్నారు. ఈ చేరికకు విశేష కృషి చేసిన నాయకులు నానాజీకి, డల్లాపల్లి గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా సమావేశంలో పాడేరు మండల నాయకులు సుర్ల సుమన్, ముదిలి సుబ్బారావు, అశోక్ తదితరులు హాజరయ్యారు.