కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన లోకి చేరికలు

పి గన్నవరం నియోజకవర్గం: పెదపట్నం లంక గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో శుక్రవారం వైయస్సార్ సీపీ గ్రామ ఉపసర్పంచ్ మాదిగ సామజిక వర్గానికి చెందిన శ్రీ & శ్రీమతి ఉందుర్తి ఏడుకొండలు, మణి కుమారి, కూనవరపు సంజీవరావు, మొమ్మిడివరపు సత్యనారాయణ, గంటి వెంకటేశ్వరరావు, మొమ్మిడివరపు సత్తిబాబు, మొమ్మిడివరపు వసంతరావు, కాపు సామజిక వర్గానికి చెందిన వై యస్ ఆర్ సిపికి చెందిన ఏడిద సత్తిబాబు, శిరిగినీడి తాతాజీ జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల అధ్యక్షులు జలేం శ్రీనివాసరాజా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, మామిడికుదురు సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, గ్రామశేఖ గిడుగు బంగారం, ఎంపీటీసీ కొమ్ముల జంగమ్మయ్య, మామిడిశెట్టి శివరామ ప్రసాద్, కొమ్ముల భద్రం, మండల నాయకులు కంకిపాటి నరసింహారావు, మద్దింశెట్టి బుజ్జి గారు, పోతుకాశీ, కొమ్ముల మాధవరావు, కొమ్ముల రాము మరియు జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.