బొలిశెట్టి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

తాడేపల్లిగూడెం రూరల్ మండలం, మోదుగుంట గ్రామానికి చెందిన సర్పంచ్ కట్టా సత్యవతి ఎంపీటీసీ దండుబోయిన విజయదుర్గలు గత శనివారం సాయంత్రం సుమారు వెయ్యి మంది వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. తదనంతరం స్థానిక వైసీపీ నాయకులు ప్రలోభ పెట్టి ఆదివారం స్థానిక శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ కార్యాలయానికి మమ్మల్ని తీసుకొని వెళ్లి వాళ్లకి అనుకూలంగా మాతో మాట్లాడించడం జరిగింది. మేము ఆత్మ సాక్షిగా జనసేనలో కొనసాగుతామని అన్నారు. అదేవిధంగా సేవాదిత్పరులు బొలిశెట్టి శ్రీనివాస్ మా గ్రామం నుండి అత్యధిక మెజారిటీ వచ్చేలాగా కృషిచేసి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అడప ప్రసాద్ మోదుగుంట గ్రామ పెద్దలు కట్ట జానకి రామయ్య, దండుపోయిన వెంకటరామయ్య, సిద్ధ వీర్రాజు, వల్లేపల్లి సత్యనారాయణ, చిటికెన హనుమంతు, బాలిన చింతయ్య, కట్ట ముత్యాలు, చిటికెన తిరుపతిరావు, వండ్రపాటి నాని, మల్లిపూడి భూషణం తదితరులు పాల్గొన్నారు.