బొర్రా ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి రూరల్ మండలం, బృగుబండ గ్రామంలో బిసి వడ్డెర కులానికి చెందిన 50 కుటుంబాలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి అలాగే పేద ప్రజల పై పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమను గ్రహించి పార్టీలోకి చేరడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గ బొర్రా వెంకట అప్పారావు ప్రతి ఒక్క కుటుంబాన్ని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. ముందుగా జనసేన పార్టీలోకి చేరినటువంటి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీలోకి చేరినటువంటి కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరారు అన్నారు. మన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల ఆశయం 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే తమ లక్ష్యమని, ప్రతి ఒక్క జనసైనికుడు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీలో ఏ జనసైనికుడికి ఆపద వచ్చిన నేను ముందు ఉంటానని భరోసాని ఇవ్వడం జరిగినది. అలాగే సత్తెనపల్లి గడ్డ మీద జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, నకరికల్లు మండల అధ్యక్షులు తాడ్వాయి లక్ష్మి శ్రీనివాస్, కమిటీ సభ్యులు, బృగుబండ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా 76 జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది.