టిడిపి, వైసిపి పార్టీల నుండి జనసేనలోకి బారి చేరికలు

విశాఖపట్నం, పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డ్, నరవ పరిసర గ్రామాలలో టిడిపి సీనియర్ నాయకులు, 35 సంవత్సరాల రాజకీయ అనుభవం, వ్యాపారవేత్త అయినటువంటి గళ్ళ శ్రీనివాసరావు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ఆధ్వర్యంలో నరవ హైస్కూల్ జంక్షన్ నుండి జరిపోతులపాలెం కాలనీ వరకు సుమారు 500 మందితో భారీ ర్యాలీగా బయలుదేరి జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు వబ్బిన జనార్థన శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం మేము స్వాగతిస్తున్నామని, ఎమ్మెల్యే కార్పొరేటర్ సర్పంచ్ వార్డ్ నెంబర్ గెలుపులో కీలక పాత్ర పోషించి ఎంతో అనుభవము గల వ్యక్తి ఈరోజు జనసేన పార్టీకి రావడానికి శుభపరిణామంగా భావిస్తూ ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని మాట్లాడడం జరిగింది. గళ్ళ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, అందర్నీ కలుపుకొని పెందుర్తి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తానని బదులు ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథి శివశంకర్ మాట్లాడుతూ మనమందరం చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేలాగా అడుగులు వేయాలని, గల్లా శ్రీనివాసరావు వ్యక్తిత్వం గల వ్యక్తులు జనసేన పార్టీకి చాలా అవసరం అని, మీ యొక్క అనుభవంతో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరచడంలో కీలకపాత్ర పోషించాలని మనస్పూర్తిగా కోరారు. వైఎస్ఆర్సిపి పార్టీ నుండి చిన్నారావు, శాస్త్రి, అప్పలరాజు, టిడిపి పార్టీ నుండి రాడి పెంటరావు, గళ్ళ రాంబాబు, మహిళలు సత్యవతి, రాధమ్మ, జ్యోతితో పాటు యువకులు సుమారు 50 మంది పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పార్వతి, శంకర్రావు, కంచిపాటి, మధు, శేఖర్, లక్కీ, గోవింద్, వైకుంఠరావు, రవి, కనకరాజు, రామారావు, చైతన్య, సతీష్, జుత్తాడ, శీను, తనకాల శీను, వరహాలు, మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.