పాలకొండ మండలంలో వైసీపీ నుంచి జనసేనలో చేరికలు

*పాలకొండ నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి వేగం
* నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పార్టీకి ఆదరణ పెరుగుతోంది

పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ మండలం జంపరకోటకు చెందిన ఎంపీటీసీ నిమ్మక దుర్గమ్మ, నిమ్మక ప్రసాద్, ముటక చంద్రరావు, ఆరిక బాబూరావు తదితరులు వైసీపీ నుంచి బయటకు వచ్చి, జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఎంపీటీసీ నిమ్మక దుర్గమ్మ తెలిపారు. జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ వారిని జనసేనలోకి ఆహ్వానించి, పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. పార్టీ విస్తరణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ జనసేన పార్టీకి చెందిన ఎంపీపీ బొమ్మాలి భాను, వైస్ ఎంపీపీ వాకుముడి అనిల్, ఎంపీటీసీ మజ్జి నవీన్, జాడ శ్రీధర్, వేణువు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment