ఎమ్మెల్యే లోకం మాధవి సమక్షంలో జనసేనలో చేరికలు

నెల్లిమర్ల నియోజకవర్గంలోని బొప్పాడం పంచాయతీ బుచ్చన్నపేట గ్రామం నుండి సుమారు 30 కుటుంబాలు వైఎస్సార్సీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి జనసేన కండువాలు కప్పి కొత్తగా పార్టీలో చేరిన వారికి స్వాగతం పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో పాటు మాధవి ప్రజా సేవా తత్వానికి ఆకర్షితులై జనసేనలో చేరుతున్నట్లు ఆ కుటుంబాలు వెల్లడించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని దౌర్జన్యాలు, అక్రమాలు, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తితో జనసేనలో చేరినట్లు వారు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడటంతో పాటు, ప్రజల కష్టాలను పట్టించుకునే నాయకత్వం వైఎస్సార్సీపీలో లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, ప్రజల కోసం ఆయన చేస్తున్న పోరాటం, అలాగే మాధవి గారి ప్రజలకు అందుబాటులో ఉండే తీరు, గ్రామాభివృద్ధిపై ఆమె కృషి చూసి జనసేన పార్టీలో చేరినట్లు వివరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు కొరాడ రమేష్, కరుమజ్జి గోవింద్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment