నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు రౌతుల శ్రీనివాస్ (ఆర్ ఎస్) మరియు వారి అనుచరులు టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి నాయకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వర్ధనపు ప్రసాద్, మళ్లీపూడి వెంకటేశ్వరరావు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.