జనసేనలో వైసిపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుల చేరిక

పుట్టపర్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై అనంతపురము జిల్లాలో పలువురు జనసేన పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలానికి చెందిన వైసిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం అనంతపురము జిల్లా కేంద్రంలోని రాంనగర్ కార్యాలయంలో పుట్టపర్తి ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ సీనియర్ నాయకులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీ.సీ.వరుణ్ మాట్లాడుతూ… పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తారని పత్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. పార్టీలోకి చేరిన వారిలో సీనియర్ నాయకులు కమ్మల నరేష్, కె.వి.శివప్ప, డి.మహేష్ రెడ్డి, రాజా, ఎం.హరి, శ్రీకాంత్, హరి ప్రసాద్, సంపత్ తదితరులు ఉన్నారు.