తెలంగాణ జనసేనలో చేరికలు
తెలంగాణ, హైదరాబాద్, జూబ్లీహిల్స్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి లింగ రాజు గౌడ్ 60 మంది విద్యార్థులతో కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలకు మరియు జనసేన ఆధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్హం ఖాన్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మరియు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్‌గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం మరియు గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.