ఏజెన్సీ పల్లెలో జనసేనలో చేరికలు

రంపచోడవరం: మరేడుమిల్లి మండలం, దేవరపల్లి గ్రామ జనసేన నాయకులు కుర్ల రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలో వారందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చిన 50 కుటుంబాలను జనసేన పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను వివిధ కారణాలు చూపి గిరిజనులకు దూరం చేయడం జరుగుతుంది. వైసిపి స్థానిక నాయకులు వల్ల ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, దానివల్ల గిరిజనులు ఎంతో నష్టపోతున్నారని ఆయన మాట్లాడారు. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఏ రహదారులను చూసినా చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. మన నాయకులు పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం నినాదం వల్ల గ్రామాలు చైతన్యవంతమై అభివృద్ధి చెందుతాయని మాటిచ్చారు. ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండల అధ్యక్షులు మల్ల దుర్గాప్రసాద్, గాదె ధర్మ తేజ, కానెం శివకుమార్, నాగుల పల్లి శ్రీను, ఎస్. రాంబాబు, భట శ్రీను, భట్ట మంగి రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.