గంగులయ్య సమక్షంలో జనసేనలో చేరికలు

పాడేరు, జనసేనపార్టీలో చేరిన డబ్బాపుట్టు గ్రామం, శుక్రవారం డబ్బాపుట్టు గ్రామస్తుల పిలుపుమేరకు ఆ గ్రామంలో జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మరియు పాడేరు మండల నాయకులు సమావేశవడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్తులతో డా.గంగులయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నది మన గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది.పాలక ప్రభుత్వ నాయకులు మీ గ్రామాల్లో ఓట్లకోసం వస్తే సగటు సామాన్య గిరిజనుడిగా ప్రశ్నించేతత్వం కలిగి ఉండాలన్నారు. దశాబ్దాల తరబడి మోసపుచ్చే విధానాలతో ఇవాళ గిరిజన ప్రాంతమంతట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. వైసీపీ ఇన్చార్జ్ మత్యరాస విశేశ్వర్రాజు ఎస్టీ కమిషన్ లో సభ్యులుగా ఉన్నప్పుడే బోయవాల్మీకి తీర్మానం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేశారు. అలాగే మన ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పదవుల్లో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగింది. ప్రస్తుతం డిఎస్సీ కోసం గిరిజన నిరుద్యోగ యువత జీవో నెం 3ని కూడా ఇదే ప్రభుత్వ హయాంలో కోల్పోయాం. మన నాయకులు అధికారంలో ఉన్నప్పుడే గిరిజన హక్కులు, చట్టాలు కోల్పోతుంటే రాబోవు ఎన్నికలకు ఏ నైతిక విలువలతో మళ్ళీ ఓటువేయండని అడుగుతారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారతారు మన గిరిజన వైసీపీ నాయకులు. వారి స్వలాభం కోసం గిరిజన జాతి నాశనం గిరిజనుల చేత తెలివిగా చేయించడం వైసీపీ కుతంత్ర రాజకీయాలకు నిదర్శనమన్నారు ఇది కేవలం గిరిజన ప్రజలకు రాజకీయ చైతన్యం లేకపోవడమే వారి మోసాలకు ప్రధాన కారణమన్నారు.ఈ సందర్బంగా డబ్బపుట్టు గ్రామస్తులు జనసేనపార్టీ సిద్ధాంతాలు లక్ష్యాలు నచ్చి పార్టీలో చేరారు. వారికి డా.గంగులయ్య పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశానికి చేరికలకు కృషి చేసిన పాడేరు జనసేన మండల నాయకులైన ముదిలి సుబ్బారావు, సుర్ల సుమన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మజ్జి సత్యనారాయణ, సాలేబు అశోక్, జంగిడే రాజ్ కుమార్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.