పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్, కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం వినాయక నగర్, రామకృష్ణ నగర్ కాలనీ వాసులు పేదిరెడ్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో మహిళలు, పెద్దలు, యువత సుమారు 40 మంది వలి,గురునాథ్, వెంకటేశ్వరరావు శ్రీమతి వల్లి, సుగుణ, రమణమ్మ, వరలక్ష్మి, జ్యోతి, ప్రసాద్, మహేంద్ర, చక్రి, ప్రసాద్, రాజబాబు, రాజేష్, రంగారావు, నరేష్ వెంకటేష్, తదితరులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, కార్యదక్షత నచ్చి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. స్థానికులు డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య ఉందని, ఈ ప్రాంతంలో ఉన్న సామజిక స్థలం కబ్జా కాకుండా కాపాడాలని తెలిపారు. ఈ సందర్బంగా నానాజీ మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యఫై అధికారులతో, మంచినీటి సరఫరా కోసం కంపెనీ వాళ్ళతో మాట్లాడతా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.