చింతూరు మండలంలో జనసేన పార్టీలో చేరికలు

చింతూరు మండలం, తుమ్మల పంచాయతీ, రింగలా గ్రామం నుంచి సోయం శ్రీను గ్రామ పటేల్ ఆధ్వర్యంలో 38 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు పాల్గొని వారికి కండువా వేసి జనసేన పార్టీలోకి స్వాగతం పలికారు మడివి రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారమే ద్యేయంగా ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండాకాడుతూ జనసేన విధివిధానాలను వివరించారు. ఈ కార్యక్రమనికి చింతూరు మండల ముఖ్య నాయకులు తీగల రవి, బేడే సతీష్, కారం దుర్గారావు, పొడియం నాగార్జున, ఉయిక వెంకటేష్, బాబురావు, గ్రామస్తులు సోయం రాజులు, సోయం సత్యం, రవ్వ మంగయ్య, ముచ్చిక బుచ్చయ్య, సోయం సీతమ్మ, చినక్క దారమ్మ తదితరులు పాల్గొన్నారు.