డా.శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

పిఠాపురం, రోజురోజుకి జనసేనకు మద్దతు పెరుగుతుంది అనడానికి నిదర్శనంగా పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామం నుంచి వైసిపి నాయకులు దుడ్డు రాంబాబు మాకు జనసేన సిద్ధాంతాలు నచ్చాయండి మా వైసీపీలో అన్యాయాలు అక్రమాలు చూడలేక ఈరోజు ఇంత చక్కని ఆహ్లాదకరమైన రోజున ఈ కార్తీక వనసమారాధన పురస్కరించుకుని 150 మంది అనుచరులతో కలిసి వైసీపీ నుంచి మన మత్స్యాకార విభాగ రాష్ట్ర కార్యదర్శి మరియు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు కంబాల దాసు సమక్షంలో డా. పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరడం జరిగింది. ఇది చాలా శుభ తరుణం రానున్న ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రజల ఆశిస్తున్నారు. అలాగే మరెన్నో జనసేన దిమ్మలు ప్రతి గ్రామాల్లో పెరగాలని, ప్రతి ఇంటికి జనసేన జెండా రెపరెపలాడలని, 2024 ఎలక్షన్ నాటికి రాష్ట్రంలో గెలిచే మొదటి సీట్ పిఠాపురం నియోజకవర్గం నుంచేనని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణ్ కానీ పిఠాపురం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడు ఏ పార్టీలోని ఏ నాయకుడు సాధించలేని గొప్ప మెజారిటీతో లక్ష ఓట్ల పైన మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చోబెడతామని డాక్టర్ శ్రీధర్ మాట్లాడడం జరిగింది. జనసేనలోనే ఉంది జనంకోసం పనిచేసే సేన జనసేన అని అందులో నేను ఒక జనసైనికున్ని నేను మన జనసైనికులతో కలిసి ప్రజలందరికీ న్యాయం చేయాలని జనాధిపతి అయిన పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కుల మతాలకు అతీతంగా పనిచేసే పార్టీ ప్రజలందరికీ న్యాయం చేయాలని మన పార్టీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనది కాబట్టి మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలను అనుసంధానము చేస్తూ కులమతాలకు అతీతంగా పక్కనే ఉన్న మాధవపురం రైల్వే గేట్ దగ్గర ప్రజలు వేచి చూస్తుంటారు ట్రైన్లు ఎప్పుడు వెళ్తాయి ఎప్పుడు వెళ్లొచ్చు అని కానీ అక్కడ జనసంద్రోహం తాకిడికి రైల్వే గేట్ సిబ్బంది మరియు జనసైనికులు ట్రైన్ల రాకపోకలకు కొంచెం సమయం తీసుకుంటూ ట్రైన్లను కొంచెం లేట్ గా పంపతూ ఉన్నారంటే అర్ధంచేసుకోవచ్చు జనసముద్రం ప్రవాహం తాకిడి ఏ విధంగా ఉన్నదో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడానికి కారణమైన ప్రతీ ఒక్క జనసైనికులకు, ఆత్మీయులకు, మిత్రులు బీజేపీ నాయకులకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ మరొక సారి మనస్ఫూర్తిగా మా కుటుంబం తరుపున, మా తరుపున, మన జనసేన పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని డా.శ్రీధర్ పిల్లా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.