చంద్రగిరి జనసేన పార్టీలో చేరికలు

చంద్రగిరి, పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, టీ వి పురం పంచాయతీ కి చెందిన 150 కుటుంబాలు ఆదివారం బీగాల అరుణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా అరుణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామని, ఈ చేరికలు చూస్తున్నట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ హరీష్ గణేష్ అధ్యక్షతన జరగడం అలాగే గ్రామస్తులు మొత్తం పాల్గొనడం జరిగింది.