కసుమూరు జనసేనలో చేరికలు

స్వతంత్ర అభ్యర్థిగా కసుమూరు పంచాయతీ నుంచి 950 ఓట్లు సాధించిన మందా రమణయ్య సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బోనబోయిన ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జిల్లా అధ్యక్షులు శ్రీ మనుక్రాంత్ చెన్నారెడ్డి నాయకత్వంలో జనసేన పార్టీ లో చేరడం జరిగింది. ప్రజారాజ్యం అప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేశానని రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తానని మందా రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, కొట్టే వెంకటేశ్వర్లు, దుగ్గిశెట్టి సుజయ్ బాబు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.