పశ్చిమ గోదావరిజిల్లాలో జనసేనలో బారీ చేరికలు

పశ్చిమ గోదావరిజిల్లా, భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం, దొంగపిండి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం నర్సాపురం పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసరావు వారి అనుచరవర్గంతో సుమారు 40మంది జనసేన జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

అదేవిదంగా పశ్చిమ గోదావరిజిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలుకి చెందిన అమృత స్వీట్ హోమ్ అధినేత భద్రి వెంకటేశ్వరరావు జనసేన జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు, ఉంగుటూరు నియోజకవర్గం ఇంఛార్జి పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.