నెల్లూరు రూరల్ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ శ్రామిక నగర్ లోని గిరిజనులపై జరుగుతున్న దాడులను దౌర్జన్యాలను వ్యతిరేకించి వారికి అండగా నిలబడిన వీరమహిళ నాగరత్నం స్పూర్తితో గిరిజన కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి జనసేన జాతీయం మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ స్వాగతించారు. అన్ని వర్గానికి న్యాయం జరగాలని పోరాడే పవన్ కళ్యాణ్ గారి జనసేన వీరమహిళలు, నాయకులు పీడించబడుతున్న వర్గాల వారికి ఆదర్శంగా నిలవడం అభినందనీయం అని ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన జాతీయ మీడియా ప్రతినిధి అజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, వీరమహిళ నాగరత్నం తో పాటు సీనియర్ నాయకులు ఏటూరు రవి, కృష్ణారెడ్డి, నందిని యాదవ్, భారతి, సుబ్బమ్మ, అపర్ణ, హాసినా, రేణుక, కృష్ణవేణి భారతి, కస్తూరి, శ్రీహరి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.