జనసేన, టిడిపిల ఉమ్మడి కార్యాచరణ సమావేశం

  • కురుపాం నియోజకవర్గంలో జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కలిసి పని చేద్దామని దిశా నిర్దేశం చేసిన జనసేన మరియు టిడిపి నాయకత్వం

కురుపాం నియోజకవర్గం: మాజీ మంత్రివర్యులు, తెదేపా సీనియర్ నాయకులు శత్రుచర్ల విజయరామరాజు మరియు టిడిపి ఇన్చార్జి శ్రీమతి తోయక జగదీశ్వరి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మరియు జనసేన నాయకత్వం పాల్గొనడం జరిగింది. కురుపాం నియోజకవర్గంలో కొణిదల పవన్ కళ్యాణ్ మరియు నారా చంద్రబాబు నాయుడు ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తారో ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మన ఇరు పార్టీల శ్రేణులు కష్టపడాలి అని, నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలు ఇరు పార్టీలు సమన్వయంతో చురుగ్గా జరపాలని చర్చించడం జరిగింది. అలాగే బాబు పాలూరు మాట్లాడుతూ జనసేన-తేదేపా పొత్తు ఉన్నప్పటికీ కురుపాం నియోజకవర్గంలో మా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు, ఇంటింటికీ జనసేన మరియు ఇతర పార్టీల నుంచి మా జనసేన పార్టీలోకి చేరికలు వంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ కార్యక్రమాలన్నిటికీ టిడిపి నాయకత్వం కూడా వచ్చి మాకు మద్దతుగా నిలవాలని కోరారు. అలాగే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, మన రాష్ట్రంలో మరియు కురుపాం నియోజకవర్గంలో వైసిపి చేస్తున్న అవినీతి/అక్రమాలపై కూడా ఉమ్మడిగా కలిసి పోరాటాలు చేసి ప్రజలను జాగ్రృతపరచాలని, ఆంధ్రా బాగుండాలంటే జగన్ ని ఓడించాలి – కురుపాం బాగుండాలంటే పాముల పుష్పా శ్రీవాణిని ఓడించాలి అనే నినాదంతో మన శ్రేణులు పని చెయ్యాలని విజయరామరాజు, బాబు పాలూరు మరియు శ్రీమతి తోయక జగదీశ్వరి తెదేపా-జనసేన నాయకులకు దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు వివిధ వివిధ పదవుల్లో కమిటీల్లో ఉన్న పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. అదే విధంగా జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు గార గౌరీశంకర్, వాన ఉపేంద్ర, పెంట శంకర్రావు, కురుపాం నియోజకవర్గ లీగల్ సెల్ లాయర్ కేతిరెడ్డి అశోక్, కొమరాడ మండల అధ్యక్షులు తెంటు శ్రీకర్, జనసేన నాయకులు కిల్లాన అనంత్ కుమార్ బుక్కురు గౌరీ శంకర్, రాయల సంతు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.