బ్రహ్మసముద్రం పంచాయితీలో జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: బ్రహ్మసముద్రం మండల కేంద్రం, బ్రహ్మసముద్రం మండల కేంద్రంతో పాటు బ్రహ్మసముద్రం పంచాయితీలో ఎర్రప్పహట్టి, తిప్పయ్యహట్టి, ముక్కన్నహట్టి, నంజాపురం గ్రామాల్లో జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి జనసేన, టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మేనిఫెస్టో అంశాలను, సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది. జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ గారి సూచనలతో ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు చిత్తప్ప మరియు జనసేన-టిడిపి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.