సీతానగరం మండలంలో జనసేన- టి.డి.పి- బిజెపిల ఉమ్మడి ఆత్మీయ సమావేశం

రాజానగరం: సీతానగరం మండలం, ముగ్గళ్ల గ్రామంలో జరిగిన జనసేన-తెలుగుదేశం- బిజెపి పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, రాజానగరం నియోజకవర్గం ఎన్.డి.ఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ శాసనసభ్యులు చిట్టూరి రవీంద్ర, మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దుష్ట పాలన పోయి ప్రజా పరిపాలన రావాలని ప్రజలందరూ సుభిక్షంగా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా నాకు కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాగే రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు, జనసైనికులు వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.