ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన కార్యాలయంలో, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం, ఆరు ముఖ్యమైన అంశాలను సభలో ప్రవేశ పెట్టి తీర్మానం చేసారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతీ ఒక్కరు పని చెయ్యాలని పేర్కొన్నారు. సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలిగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న, నీతి, నిజాయితీ, నిబద్దత, చిత్తశుద్ధి కలిగిన ఏకైక నాయకుడు పెట్టిన జనసేన పార్టీ జండా ఆవిష్కరణలు ప్రతి గ్రామంలో చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, గర్బాన సత్తిబాబు, భూపతి అర్జున్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కూరాకుల యాదవ్, సంతోష్ పండా, యు.పి రాజు, జిల్లా కార్యదర్శిలు కోరుకొండ మల్లేశ్వరరావు, అంపోలు హరీష్ కుమార్ శ్రీకాంత్, మజ్జి భాస్కర్, తాలాబత్తుల పైడిరాజు, కొంచాడ చిన్నంనాయుడు, వడ్డాది శ్రీనివాసరావు, సలాసన షణ్ముఖరావు, బొంతు విజయకృష్ణ, పల్లి కోటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శిలు వారాది వరలక్ష్మి, కీర్తి సుశీల, దాసరి బలరాం, ఇసాయి వేంకటేష్, మహ్మద్ రఫీ, చిట్టి భాస్కర్, వజ్రగడ రవికుమార్(జనసేన జానీ) అనపాన జనార్దన్ రెడ్డి, కొండ్ర వరప్రసాద్, గొట్టా హరిప్రసాద్, సైలాడ జగదీశ్వరరావు పాల్గొన్నారు.
Share this content:
Post Comment