ఉమ్మడి విశాఖ జిల్లా ఆత్మీయ సమావేశ ఏర్పాట్ల పరిశీలన..!

నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో 10వ తేదీన జరగబోయే ఉమ్మడి విశాఖ జిల్లా ఆత్మీయ సమావేశానికి కొబ్బరికాయ కొట్టి స్టేజ్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి గెడ్డం బుజ్జి, మండల అధ్యక్షులు వెలగా సుధాకర్, మండల ఉపాధ్యక్షులు నల్లల రత్నాజి పాల్గొన్నారు. జనసేన పార్టీ నుండి 20 మంది శాసన సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మార్చి 14వ తేదీన పిఠాపురం చిత్రాడలో జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా జరపడానికి దిశా నిర్దేశం చేయనున్నారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో 10వ తేదీన జరగబోయే ఉమ్మడి విశాఖ జిల్లా ఆత్మీయ సమావేశానికి సంబంధించి సభా స్థలం మరియు స్టేజ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి గెడ్డం బుజ్జి, తొట నగేష్, నీటి కాలువ అధ్యక్షులు గెడ్డం చైతన్య, గెడ్డం ఆకాష్, నాలుగు మండలాల అధ్యక్షులు వెలగా సుధాకర్, యగదాసు నానాజి, పప్పల శివ, సింగంపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రథాన కార్యదర్శి దేవవరపు రఘు, జిల్లా కార్యదర్శి పల్లి దుర్గారావు, జగ్గన్నదొర, నక్కపల్లి మండల ఉపాధ్యక్షులు నల్లల రత్నాజి, ఎంపీటీసీ మాకినీడి చిట్టిబాబు, తుమ్మల శ్యామ్, తమ్మల గణేష్, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-08-at-1.21.22-PM-1-1024x576 ఉమ్మడి విశాఖ జిల్లా ఆత్మీయ సమావేశ ఏర్పాట్ల పరిశీలన..!

Share this content:

Post Comment