*ప్రముఖ న్యాయవాది పార్టీలో చేరిక
*స్వాగతించిన ఇన్చార్జ్ దేవర మనోహర్
చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఊపు వచ్చింది. కూటమి విజయంతో ప్రజలలో నమ్మకం పెరిగి, అభివృద్ధి కార్యక్రమాలతో విశ్వాసం మరింత బలపడుతోంది. తాజాగా ఈ విశ్వాసానికి మరో నిపుణుడి మద్దతు జతైంది. స్థానిక ప్రముఖ న్యాయవాది నరేంద్ర కుమార్ రెడ్డి జనసేన పార్టీలోకి చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పథం తనను ఆకట్టుకుందని, పార్టీ సిద్ధాంతాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేవర మనోహర్ శ్రమను అభినందించిన ఆయన, పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేస్తానని స్పష్టం చేశారు. ఇంకా చేరికల పట్ల స్పందించిన దేవర మనోహర్, ఇది పార్టీని బలోపేతం చేసే పరిణామమని పేర్కొన్నారు. నీతి, నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్న జనసేనలోకి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన సైనికులను మర్చిపోరని, ఇది విశ్వాసం కలిగించే మాట అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this content:
Post Comment