Jr ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

ఇంటర్నెట్ ప్రపంచంలో రోజుకో క్రైమ్ స్టోరీ బయటపెడుతోంది. ఎక్కువ మంది అమ్మాయిలు అపరిచిత వ్యక్తులతో సైబర్ నేరగాళ్ల మోసల్లో అమ్మాయిలు బలవుతున్నారు. ఒక్క సెకనులలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలకు యువత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ ఘటనలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కేవలం ఘటనలపై చర్యలను తీసుకోవడమే కాకుండా జనాలు మోసపోకుండా ఒక అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో బాగoగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో చేశాడు.

ఆన్ లైన్‌లో అపరిచితులతో స్నేహం చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తూ తారక్ ఒక వీడియో చేశాడు. తారక్ వ్యాఖ్యానం కంటే ముందు ఇందులో ఒక వీడియో చూపించారు. ఒక అమ్మాయి తన గదిలో ఏడుస్తూ ఉంటే తన స్నేహితురాలు వచ్చి ఏమైందని అడుగుతుంది. ఫేస్ బుక్‌లో ఒక అబ్బాయితో పరిచయం జరగడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం.. అతను ప్రపోజ్ చేయగా.. ఆ అమ్మాయి ఓకే చెప్పడం.. తర్వాత ఆ అమ్మాయి నగ్న చిత్రాలు అడిగితే ఆమె పంపడం.. వాటిని పెట్టుకుని అతను ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడం.. ఆ అమ్మాయి తీవ్ర మానసిక వేదనకు గురి కావడం.. ఇలా సాగుతుందా వీడియో. ఇది ముగిశాక ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. తగు జాగ్రత్తలు వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్ లైన్ పరిచాయలు అనుకోని కష్టాలనలకు కారణం కావచ్చు. దైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయండి. జాగ్రత్త.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన విధానం నెటిజన్స్ ని ఎంతగానో ఆలోచింపజేస్తోంది.