ఘనంగా జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ లోగో ఆవిష్కరణ

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై జనసైనికులు అందరూ సంఘటితమై ఒక్క టీమ్ గా వెళ్ళాలి అనే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” లోగో ఆవిష్కరణ ది 2-12-22 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీరమహిళలచే ఘనంగా జరిగింది. జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ లోగోను వీరమహిళలు లండన్ నుండి శ్రీమతి పద్మజ రామిశెట్టి, శ్రీమతి ప్రశాంతి తాడికొండ, మరియు శ్రీమతి శైలజ వీరంకి, సౌత్ కొరియా నుండి శ్రీమతి హిమశ్రీ పుట్టా, జర్మనీ నుండి పద్మజ వరికూటి మరియు ఇండియా నుండి శ్రీమతి రత్న పిల్లా తదితరులు ఆవిష్కరించడం జరిగింది.