భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్లతో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం

  • జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో 13వ జూమ్ సమావేశం
  • పలు దేశాల నుండి జూమ్ సమావేశంలో పాల్గొన్న ఎన్నారై జనసేన నాయకులు మరియు వీరమహిళలు

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ఆ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి అధ్యక్షతన, జనసేన పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభించి తన పోరాట పఠిమతో, అకుంటిత దీక్షతో, నియోజకవర్గంలోనే కాక అనేక ప్రాంతాలలో ఎన్నో సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగి ఎందరో కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచిన భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల ముఖ్య అతిథిగా శనివారం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్యలక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారైల కలయిక” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు మరియు వీరమహిళలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 15 దేశాలకు పైగా జనసేన నాయకులు ఈ జూమ్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డా.సందీప్ పంచకర్లను వివిధ దేశాలకు చెందిన జనసేన నాయకులు పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డా.సందీప్ పంచకర్ల మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబు శుక్రవారం ఒక సమావేశం నిర్వహించారని ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకులందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, అందరికి ఆయన అందుబాటులో ఉంటానని తెలిపారని, జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారని అన్నారు. ఇటీవల బూత్ కమిటీల కార్యాచరణ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తులో భాగంగా సంజీవ్ ను నియమించారని ఆయన దానిపై గట్టిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే శ్రీకాకుళం మండలాధ్యక్షుల నియామకం పూర్తయిందని మే నెలాఖరుకు మొత్తం ఉత్తరాంధ్ర మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఎన్నారై నాయకులందరూ పలు నియోజకవర్గాలపై దృష్టి పెట్టకుండా వారి స్థితిగతులను బట్టి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నియోజకవర్గాన్ని కాని ఒక్కొక్క జిల్లాను కాని అప్పజెప్పాలని ఎన్నారై నాయకులు అడిగినదానికి సమాధానంగా మంచి ఆలోచన అని దీనిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఎన్నారై నాయకులు యువతకు భరోసాగా స్కిల్ డెవెలప్మెంట్ కార్యక్రమాలు చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చూస్తే బాగుంటుందని తెలుపగా జనసేన పార్టీ ఐటి చైర్మన్ మిరియాల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసారని త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. మీడియాను బలోపేతం చేసేవిధంగా జనసేన సప్పోర్టర్స్ కి పార్టీ నుండి కొంత సహకారమందిస్తే బాగుంటుందని తెలుపగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. భీమిలి నియోజవర్గంలో జనసేన ప్రభావం ఎలా ఉందని అడగగా భీమిలిలో 2019 లోనే జనసేన పార్టీకి 24,248 ఓట్లు వచ్చాయని ఇపుడు భీమిలిలో ఓటింగ్ శాతం బాగా పెరిగిందని జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలలో భీమిలి ఒకటి అని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జనసేనకు ఎలా ఉంది అని ప్రశ్నించగా 2024లో జనసేన ప్రస్థావన లేకుండా ప్రభుత్వ స్థాపన ఉండదని అన్నారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జర్మనీ నుండి సురేష్ వరికూటి, సుధాకర్, లోకేష్ పెద్దిరెడ్డి, అశ్విన్ కుమార్ మత్తి, శివప్రసాద్ మత్తి, రత్నాకరం, శేషు కుమార్, రాజ్ కుమార్ చిక్కాల, సురింద్ర ఆవుల, క్రాంతి కిరణ్, భరత్, యూఎస్ నుండి శేఖర్ పిల్లా, కంబోడియా నుండి నవీన్ నవబోతు, కెన్యా నుండి ప్రవీణ్ మొగసాటి, ఆస్త్రేలియా నుండి హేమ, రామకృష్ణ రావుల, సంతోష్, స్వీడన్ నుండి మహేష్, నైజీరియా నుండి ఈశ్వర్, సౌత్ కొరియా నుండి డా.నవీన్ కుమార్, యూఏఈ నుండి ఇంద్రనీల్ ముప్పిడి, సేచెల్లీస్ నుండి రమేష్ సేపేన, ఇండియా నుండి ప్రభావతి వసంతాల, యూకే నుండి నాగరాజు వడ్రాణం, శంకర్ సిద్ధం, చందు సిద్ధం, పద్మజ రామిశెట్టి, అమల చలమలశెట్టి, బాల నల్లి, హరి పట్టెల, జగదీష్ గాజుల, జోజిబాబు గుబిలి, రాహుల ఆవుల, శ్రీనివాస్ కుల్చా, యర్రా, వెంకట్ అద్విక్, అవినాష్ నల్లమోతు, బాల, పవన్ పోతురాజు, రుద్ర, వెంకటేష్, శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.